![]() |
![]() |

'గుప్పెడంత మనసు' ఇప్పుడు స్టార్ మాలో అతి ఎక్కువ వీక్షకాదరణ పొందుతూ వస్తున్న ధారావాహిక. శనివారం రోజు జరిగిన ఎపిసోడ్-654 లో రాజీవ్ హాస్పిటల్ లో ఉన్న వసుధార తల్లితండ్రుల దగ్గరికి వస్తాడు. "మామయ్య గారు.. కళ్లు తెరవండి.. నేను వచ్చేశాను. మీరు ఎంత కాలం నన్ను నమ్ముతారో.. అంతవరకు మీకు నటించే అల్లుడిగా ఉంటాను. మీతో ఏం ప్రాబ్లం లేదు మామయ్య గారు. అత్తయ్య గారితోనే ప్రాబ్లం. అత్తయ్యగారు మీరు లేస్తే పొడిచింది నేనే అని మామయ్య గారితో చెప్తారు. మీరు బ్రతికి నన్ను జైలుకు పంపిస్తారా? చచ్చిపోయి నాకు పెళ్లి చేస్తారా? మీరు చనిపోండి" అంటూ ఆక్సీజన్ మాస్క్ తీసేస్తాడు రాజీవ్. అలా చేస్తున్నప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడతాడు. "మీ కోరిక ఏంటో చెప్పండి అత్తయ్య.. వసుధారకి నాకు పాప పుడితే.. మీ పేరే పెట్టుకుంటాను. మీ కూతురిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను" అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాజీవ్.
ఇదంతా జరిగేటప్పడు చక్రపాణి చూస్తాడు. రాజీవ్ మాటలను వింటాడు. వసుధార తల్లి బెడ్ పైన శ్వాస అందక తల్లడిల్లుతూ ఉంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రిషి చూసి, ఆక్సీజన్ మాస్క్ పెట్టి డాక్టర్ ని పిలుస్తాడు. "డాక్టర్ .. ఎంత ఖర్చు అయిన నేను పెట్టుకుంటాను. వీళ్ళకి నేను ఉన్నాను" చెప్తాడు. ఆ తర్వాత రాజీవ్ వచ్చి రిషిని చూస్తాడు. "ఇక్కడికి నువ్వెందుకు వచ్చావ్" అని రాజీవ్ అనగా.. "వీళ్ళు వసుధార తల్లి తండ్రులు" అని రిషి అంటాడు. అప్పుడు రాజీవ్ "నీకు వసుధార తల్లిదండ్రులు మాత్రమే. కానీ నాకు అత్తయ్య మామయ్యలు" అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరికి వాగ్వాదం జరుగుతుంది. "ఇతని వల్లే, వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు" అని డాక్టర్ తో రాజీవ్ చెప్పి, రిషిని బయటకు పంపించేలా చేస్తాడు.
ఆ తర్వాత రిషి గురించి జగతి, మహేంద్ర లు మాట్లాడుకుంటారు. "వసుధారకి అసలేం జరిగింది. తను ఎందుకిలా చేస్తుంది. రిషి ఇంత గోరాన్ని తట్టుకోలేడు. చాలా సున్నిత మనసు గలవాడు" అని మహేంద్ర అనగా, "లేదు.. రిషి తట్టుకొని గెలుస్తాడు మహేంద్ర" అని ఏడుస్తుంది జగతి. కాగా రిషి ఒంటరిగా దూరంగా వెళ్లి వసుధారని తల్చుకొని ఎమోషనల్ అవుతాడు. "వసుధార.. నా జీవితంలోకి రావడం వెళ్లడం నీ ఇష్టమేనా.. నన్ను మోసం చేసావా.. 'రిషిధార' నుండి నన్ను వేరు చేసావా" అని గట్టిగ అరుస్తాడు. ఆ తరువాత జగతి, మహేంద్ర ఇంటికి వచ్చి రిషి గురించి అడుగుతారు. అప్పుడే దేవయాని ఇంటికొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |